Thursday, December 19, 2024

శ్రీకాకుళంలో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిగిడాం మండలం బాతువా గ్రామ శివారులో సాంకేతిక సమస్యలతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగారు. అదే సమయంలో మరో ట్రాక్ లో కోణార్క్ ఎక్స్ ప్రెస్ రావడంతో ప్రయాణికులను ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ఐదుగురు దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ డిఒ, తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు అస్సాంకు చెందిన వారిన రైల్వే అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News