Monday, January 20, 2025

అసిఫానగర్ లో ఐదుగురు అదృశ్యం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసిఫానగర్ ప్రాంతం కులుసుంపురలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. స్థానికులు ఇద్దరు మహిళలు, చిన్నారులు కారులో వెళ్ళినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు మహిళలు ఒకే బంగ్లాలో అద్దెకి ఉంటున్నారని  స్థానికులు తెలిపారు. ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని బంధువులు తెలిపారు. తిరిగి ఇంతవరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన వారు వారంతట వారే వెళ్లారా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని బంధువులు ఆందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News