Wednesday, January 22, 2025

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్  : మహబూబాబాద్ టాస్క్‌ఫోర్స్, టౌన్ పోలీసు అధికారులు ప్రత్యేక నిఘాతో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యులతో కూడిన ముఠా సభ్యలపై కేసులు నమోదు చేసి వారిలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ కేసుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా మానుకోట పట్టణంలో కొందరు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న విషయంలో టౌన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ పాల్పడుతున్న వ్యక్తులపై పెట్టిన నిఘాతో ఎనిమిది సభ్యులతో కూడిన బెట్టింగ్ పాల్పడుతున్న మూఠాను గుర్తించి వారిలో ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.

బెట్టింగ్‌లో ప్రధాన నిందితుడిగా గుంటూరుకు చెందిన వంగినేని చిరంజీవి అలియాస్ బి.కె, పోశం శ్రీనివాస్, గంజి చైతన్యలు భూకీలుగా వ్యవహరిస్తూ చైన్ లింకింగ్ సిస్టం ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారని ఎస్పీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వీరు బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారని పేర్కోన్నారు. మానుకోట పట్టణానికి చెందిన కాట సుధాకర్, శ్రీకాంత్ యాదవ్, బత్తిని ఉదయ్, మల్లం వంశీకృష్ణ, ఎండి రిజ్వాన్‌లు ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై గుంటూరుకు చెందిన చిరంజీవికి ఫోన్ చేసి రేటింగ్ తెలుసుకుంటారని ఎస్పీ వెల్లడించారు. తర్వాత వారికి నచ్చిన జట్టు మీద డబ్బులు బెట్టు పెడుతుంటారని ఆ వివరాలను చిరంజీవి నోట్ చేసుకుంటారని తెలిపారు.

ఈ మేరకు బెట్టింగ్‌కు సంబంధించిన నగదును ఖమ్మంకు చెందిన గంజి చైతన్య మానుకోటకు వచ్చి బెట్టింగ్ పెట్టిన వారి నుంచి నగదును తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాశం శ్రీనివాస్‌కు పంపించడం జరుగుతుందన్నారు. ఆ డబ్బును పాశం శ్రీనివాస్ నుంచి చిరంజీవి తీసుకుంటారని ఎస్పీ వివరించారు. ఈ విధంగా గత కొంత కాలంగా బెట్టింగ్‌లో గెలిచిన వ్యక్తికి ఇదే క్రమంలో డబ్బులు అందజేస్తుంటారని ఎస్పీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News