మృతులలో 20 రోజుల నవజాత శిశువు
జైపూర్(రాజస్థాన్): నవజాత శిశువుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు ఇక్కడి దూదు ప్రాంతంలోని పాడుబడిన బావిలో శనివారం లభించాయి. ఇది సామూహిక ఆత్మహత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కుటుంబం మీనో కా మొహల్లాలో నివసిస్తోందని, మే 25న మార్కెట్ వెళుతున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరారని పోలీసులు తెలిపారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ ఐదుగురు కనపడడం లేదని వివిధ ప్రాంతాలలో పోస్టర్లు కూడా అంటించారని పోలీసులు తెలిపారు. బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టమ్ నిర్వహించినట్లు దూదు పోలీసు స్టేషన్ అధికారి చేతారాం తెలిపారు. మృతులను అక్కచెల్లెళ్లు కాళీదేవి(27), మమతా మీనా(23), కమలేష్ మీనా(20), హర్షిత్(4), 20 రోజుల నవజాత శిశువుగా గుర్తించారు. ఇందులో ముగ్గురు సోదరీమణులు ఒకే కుటుంబానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారని, వీరు అత్తింటి వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు.