Sunday, December 22, 2024

పాతబస్తీలో ఐదు స్టేషన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు పను లు చేపట్టేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ సన్నాహక పనులను ప్రారంభించిందని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. పాత నగరంలో 5.5 కి. మీల బ్యాలెన్స్ మెట్రో అలైన్‌మెంట్ ఎంజిబిఎస్ నుంచి దారుల్షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్ , అలీజాకోట్ల – మీర్ మోమిన్, దైరా, హరిబౌలి, – శాలిబండ, – శంషీర్‌గంజ్ , అలియాబాద్ మీ దుగా ఫలక్‌నుమా వరకు ఈ మెట్రో లైన్ ఉంటుందన్నారు. ఈ మెట్రో రైల్ మార్గంలో 5 స్టేషన్లు -సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమాలు ఉంటాయని ఆయన తెలిపారు. మెట్రోస్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజి యం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్లకు నగరంలో ఉన్న ప్రా ముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.

స్టేషన్ పరిసరాల్లో రహదారి 120 అడుగులకు 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశానవాటికలు, 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన ఇతర సున్నితమైన నిర్మాణాలు ఈ మెట్రో రైల్ మార్గంలో ఉ న్నాయని ఆయన పేర్కొన్నారు. కర్వేచర్ సర్దుబా టు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు మొదలైన ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, నాలుగు తప్ప మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను పరిరక్షిస్తామన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్‌మెంట్ ఇంజనీరింగ్ పరిష్కారాలు జరుగుతున్నాయన్నారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయనున్నట్టు ఆయన తెలిపారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా స్టేషన్ పరిసరాల్లో రహదారిని 120 అడుగులకు విస్తరిస్తామన్నారు. విస్తరణలో ఎఫెక్ట్ అయ్యే దాదాపు 1,000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించామని, నెలరోజుల్లో భూ సేకరణ నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News