Monday, December 23, 2024

ఐదుగురు మిలిటెంట్లు హతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  శుక్రవారం రాత్రి చురాచాంద్‌పేర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. చురాచాంద్‌పూర్ జిల్లాలోని సౌటన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లను భద్రతా దళాలు కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో తోర్‌బంగ్ వద్ద మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మిలిటెంట్ హతం కాగా ఇద్దరు ఐఆర్‌బి జవాన్లు గాయసడినట్లు వారు చెప్పారు. మెజారిటీ మైతీ తెగను షెడ్యూల్డ్ తెగల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు గత కొద్ది రోజులుగా చేపడుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపుతప్పింది.

Also Read: బిజెపితోనే సమర్థ పాలన : ఈటల

షెడ్యూల్డ్ తెగ హోదా కోసం గిరిజనేతర మైతీ వర్గం డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. దీంతో గొడవలు మొదలైనాయి. రాష్ట్ర మొత్తం జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీలు ఎక్కువగా ఇంఫాల్ వ్యాలీలో నివసిస్తున్నారు.జనాభాలో 40 శాతం వరకు నాగాలు, కుకీలు సహా గిరిజనులు ఉన్నారు. వీరు వ్యాలీ చుట్టూ ఉన్న కొండప్రాంత జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా ఇరు పక్షాలు నిరసనలు, ప్రదర్శనలు జరుపుతున్నప్పటికీ ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు అదుపుతప్పిందో కారణాలపైన, రాష్ట్రంలో పరిస్థితిపై శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News