Tuesday, November 5, 2024

నీట్ లీకేజీలో మరో ఐదుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురు వ్యక్తులను బీహార్ పోలీసుకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది. తాజా అరెస్టులు జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో జరిగినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. నిందితులు ఐదుగురిని ప్రశ్నించేందుకు పాట్నాకు తరలించినట్లు ఆ అధికారి తెలిపారు. ఇదివరకు రాంచిలో అవదేష్ కుమార్, ఆయన కుమారుడు, నీట్ అభ్యర్థి అభిషేక్‌ను అరెస్టు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం కోసం ఈ కేసులో ప్రధాన సూత్రధారి సికందర్ యాదవేందుకు రూ. 40 లక్షలు చెల్లించినట్లు అవదేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. జార్ఖండ్‌లోని నిర్మాణ పరిశ్రమలో పనిచేయడం ద్వారా సికందర్‌కు, అవదేష్‌కు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు కాంట్రాక్టర్ పనిచేసి ప్రస్తుతం బీహార్‌లోని దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సికందర్ జార్ఖండ్‌లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

రాంచిలో సికందర్ కుమారుడికి ఇన్ఫినిటీ పేరిట ఒక పెద్ద స్పోర్ట్ స్టోర్ ఉండడంతోపాటు నగరంలోని బరియాతు ప్రాంతంలో ఒక విశౠలమైన బంగళా ఉంది. సికందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఒక కేసును నమోదు చేసేందుకు ఆర్థిక నేరాల విభాగం సన్నాహాలు చేస్తోంది. నలుగురు నీట్ యుజి అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులతోసహా మొత్తం 13 మందిని ఇదివరకే బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అనురాగ్ యాదవ్, సికందర్ యాదవేందు, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ ఉన్నారు. పరీక్ష తేదీకి ఒకరోజు ముందుగానే మే 4వ తేదీన తమకు నీట్ ప్రశ్నాపత్రం అందిందని లీకైన పేపర్లు పొందిన అభ్యర్తులు వెల్లడించారు. నీట్ అక్రమాలకు పాల్పడిన నలుగురు నేరస్థులు ఒక సురక్షిత ప్రదేశానికి ఎస్‌యువిలో వెళుతున్నట్లు పాట్నా పోలీసులకు ముందుగా అందిన సమాచారమే ఈ అరెస్టులకు దారితీసింది. ఆ ప్రదేశానికి వెళ్లిన పోలీసులకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చెల్లించి నీట్ ప్రశ్నాపత్రం, జవాబులు పొందిన అభ్యర్థులు పట్టుబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News