Wednesday, January 22, 2025

మరో ఐదు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాగల ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం ఉత్తర కోస్తా కర్ణాటక , దాని పరిసన ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.

వీటి ప్రభావాలతో తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు తేలిక పాటి నుంచి.. ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాగల మూడు రోజులు ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హకీంపేటలో అత్యధికంగా 65.4 మి.మి వర్షం కురిసింది. జాఫర్‌గడ్‌లో 56.2, గోల్కొండలో 46,షేక్‌పేటలో 43, బూర్గంపహడ్‌లో 37, వేములవాడలో 31, షంశాబాద్‌లో 30.5, రేగోడ్‌లో 29.6, ,చార్మినార్‌లో 27.4, దుండిగల్‌లో 26, యాదగిరిగుట్టలో 25.5, అంబర్‌పేటలో 24.8 మి.మీ చోప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News