Friday, December 20, 2024

గ్రేటర్ లో మరో ఐదు డిఎంహెచ్‌ఒ పోస్టులు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే ఉన్న ఒక్క పోస్టుతో కలిపి జిహెచ్‌ఎంసి పరిధిలో ఆరుకు చేరిన పోస్టుల సంఖ్య

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 మంది డిఎంహెచ్‌ఒలు

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్:ప్రాథమిక ఆ రోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందు కు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముం దడుగు వేసింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మే రకు ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏ ర్పాటు చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన కమిటీ ప్రతిపాదనలను ప్ర భుత్వం ఆమోదిస్తూ జిఒ నెంబర్ 142ను గురువారం విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో మానవ వనరుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు అనుమతించింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా తగిన వైద్య సి బ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు.

కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క డిఎంహెచ్‌ఒ మాత్రమే ఉండేవారు. పెరిగిన జనాభా అ వసరాలకు అనుగుణంగా వైద్యారోగ్య అధికారుల పెంపును గత పాలకు లు నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుత, భవిష్యత్తు వైద్య అవసరాలు గుర్తించిన ప్రభు త్వం అదనంగా ఐదు డిఎంహెచ్‌ఒ పోస్టులను మంజూరు చేసింది. చా ర్మినార్, ఎల్‌బినగర్, శేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జిహెచ్‌ఎంసి జోన్ల వారీగా వీటి ఏర్పాటు చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 డిఎంహెచ్‌ఒలు ఉండనున్నారు. కొత్త డిఎంహెచ్‌ఒలను కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 డిఎంహెచ్‌ఒలు ఉంటారు.
కొత్తగా 40 మండలాల్లో పిహెచ్‌సిలు
రాష్ట్రంలో 636 పిహెచ్‌సిలు ఉండగా, ఇందులో వైద్యాధికారి, పర్యవేక్షణ సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరగలేదు. దీంతో పిహెచ్‌సిలను ఏకరీతి సిబ్బంది నమూనాను కలిగి ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా ఏర్పడి పిహెచ్‌సిలు లేని 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో 30 మండలాల్లో ఉన్న పిహెచ్‌సిలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ ప్రదేశాలలో ఔట్ రీచ్ కార్యకలాపాలు సిహెచ్‌సిలచే నిర్వహిస్తున్నారు. అయితే అన్ని సిహెచ్‌సిలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్‌రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పిహెచ్‌సిల అవసరం ఏర్పడింది. ఈ 30 మండలాల్లో ప్రభుత్వం పిహెచ్‌సిలను మంజూరు చేసింది.

రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యుపిహెచ్‌సి) బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌లను టివివిపి ఆసుపత్రుల పరిధిలోకి తీసుకురావచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టి.బి ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. 1,712 పోస్ట్‌లు సూపర్‌న్యూమరీ పోస్ట్‌లుగా మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హేతుబద్దీకరణలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ పోస్టులు రాలేదు కాబట్టి పిహెచ్‌సిలు, ఇతర సంస్థలలో మంజూరు చేయబడిన 4,246 ఎంపిహెచ్‌ఎ(మహిళ) పోస్టుల సంఖ్య మారదని తెలిపారు. హేతుబద్ధీకరణ ప్రక్రియలో రోగుల సంఖ్యకు అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News