Sunday, December 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఐదుగురు నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మెటనల్ గ్రామ సమీపంలోని అడవులలో నక్సల్స్‌ను అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. అరెస్టయిన వారిని సాయి మంగు అలియాస్ మంగు కుంజం(45), మహేష్ కుర్సం(28), లాలు పోతం(32), ఫుల్లి పునెం(29), ధన్ను పుఎం(28)గా గుర్తించారు. డిఆర్‌జి, స్థానిక పోలీసుల సంయుక్త బృందం నక్సల్స్ కోసం గాలింపు జరుపుతుండగా ఈ అరెస్టులు జరిగినట్లు ఆయన చెప్పారు. నిషిద్ధ మావోయిస్టు సంస్థకు చెందిన జనతన సర్కార్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మంగు కుంజంపై రూ. 1లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News