Sunday, January 19, 2025

బస్తర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్..ఐదుగురు నక్సలైట్లు హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో శనివారం తిరుగుబాటు వ్యతిరేక కార్యక్రమంలో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారని, ఇద్దరు భద్రత సిబ్బంది గాయపడ్డారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు. నారాయణ్‌పూర్, కాంకెర్ జిల్లాల సరిహద్దులో ఉత్తర ఉబూజ్‌మడ్‌లో ఒక అడవిలో శనివారం ఉదయం సుమారు 8 గంటలకు భద్రత సిబ్బంది ఉమ్మడి బృందం నక్సలైట్ల వ్యతిరేక కార్యక్రమానికి పూనుకున్నప్పుడు కాల్పుల పోరు ప్రారంభమైందని ఆయన తెలిపారు. సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) ఉమ్మడి బృందం

ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ఆ ప్రదేశంలో నుంచి ఇంత వరకు ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలను, కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలియజేశారు. కాల్పుల పోరులో ఇద్దరు భద్రత సిబ్బందికి గాయాలు తగిలినట్లు, వారిని చికిత్స నిమిత్తం రాష్ట్ర రాజధాని రాయిపూర్‌కు తరలించినట్లు, వారికి ప్రాణాపాయం తప్పినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనతో సహా రాష్ట్రంలో కాంకెర్, నారాయణ్‌పూర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇంత వరకు 197 మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News