Monday, November 18, 2024

ఐదుగురు ఘరానా నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

సుక్మా (ఛత్తీస్‌గఢ్): మొత్తం రూ.19 లక్షల నగదు రివార్డు ఉన్న ఐదుగురు నక్సల్స్ గురువారం సుక్మా జిల్లా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయారు. సీనియర్ నక్సల్స్ అరాచకాలు, అమానవీయం, శుష్క మావో సిద్ధాంతానికి నిస్పృహ చెంది వారంతట వారే లొంగిపోయినట్టు సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చావన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నక్సల్ నిర్మూలన విధానం, సంక్షేమ కార్యక్రమాలకు తాము ఆకర్షితులయ్యామని వారు చెప్పారని కిరన్ తెలిపారు.

లొంగిపోయిన నక్సల్స్ ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో కవాసి దుల(25), సోది బుధ్ర(27) మడ్కం గంగి( 27) వీరంతా చాలా క్రియాశీలంగా క్రమంగా డిప్యూటీ కమాండర్, సెక్షన్ కమాండర్, సెక్షన్ ఎ కమాండర్ క్యాడర్లలో ప్లాటూన్ నెం 30 మావోయిస్టులుగా పనిచేసేవారు. వీరిపై తలాఒక్కింటికి రూ.5 లక్షల నగదు రివార్డు ఉంది.

మరో రెండు క్యాడర్లలో పోడియం సొండి(25), ప్లాటూన్ నెం. 30లో పార్టీ సభ్యులు. మక్కమ్ ఆయతే(35) కిస్తారం ఏరియా మావోయిస్టుల కమిటీ టైలర్ టీమ్‌లో సభ్యురాలు. వీరిద్దరి తలపై చెరో రూ.2 లక్షల వంతున నగదు రివార్డు ఉంది. సుక్మా పోలీస్ యాంటీ నక్సల్ సెల్ లోని నిఘా విభాగం, పొరుగున ఉన్న ఒడిశా పోలీస్‌లు ఈ నక్సల్స్ లొంగుబాటుకు కీలక పాత్ర వహించారని చావన్ తెలిపారు.ఈ ఐదుగురు నక్సల్స్ పోలీస్ బృందాలపై దాడులు, రోడ్లు ధ్వంసం వంటి దారుణాలకు పాల్పడ్డారని చావన్ వివరించారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.25, 000 ఆర్థిక సాయం అందజేయడమైందని, ఇంకా పునరావాసం కల్పించడమౌతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News