Wednesday, January 22, 2025

ఐదుగురు నక్సల్స్ సరెండర్ , ముగ్గురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం ఐదుగురు నక్సలైట్లు లొంగిపొయ్యారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మూడు ఐఇడిలను స్వాధీన పర్చుకున్నారు. రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో ఈ వేర్వేరు ఘటనలు జరిగాయి. పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. సుక్మాలో మహిళా నక్సలైట్లు దూధి భీమే, సహచర నక్సలైట్లు వెట్టి రాజా, వంజం గంగా, దూధి పూజా అలియాస్ బొక్కె అలియాస్ బైరా, కవాసీ భీమాలు సరెండర్ అయినట్లు పోలీసు అధికారి ఒక్కరు తెలిపారు. కాగా ఇద్దరు నక్సలైట్లు వెక్కో హిడ్మా , మదకం నందాలను పోత్కల్లి గ్రామ సమీపంలో అరెస్టు చేశారని వివరించారు. భద్రతా బలగాలను లక్షంగా చేసుకుని అమర్చిన మూడు మందుపాతరలను కూడా పోలీసు బృందాలు స్వాధీనపర్చుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News