Friday, January 3, 2025

జార్ఖండ్‌లో ఐదుగురు నక్సల్స్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన స్వయం ప్రకటిత సబ్ జోనల్ కమాండర్‌తోసహా ఐదుగురు మావోయిస్టులను జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి ఒక కార్బైన్, మూడు రైఫిళ్లు, మూడు నాటు రివాల్వర్లు, 137 లైవ్ కార్ట్రిడ్జులతోసహా భారీ ముత్తంలో ఆయుధాలు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

రూ. 5 లక్షల బహుమతి ఉన్న సబ్ జోనల్ కమాండర్‌ను జిల్లాలోని అంజన్ హీరాఖండ్ జిల్లాలో బుధవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు మావోయిస్టులను అరెస్టు చేశామని దక్షిణ చోటానాగ్‌పూర్ డివిజన్ డిఐజి అనూప్ బిర్తారే తెలిపారు. జిల్లాలో గత మూడేళ్లలో పలువురు మావోయిస్టు నాయకుల మరణాలు లేదా అరెస్టులు జరిగాయని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News