- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఐదుగురు నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరిపై రూ. 1 లక్ష రివార్డు ఉంది. సీనియర్ నాయకులు చేస్తున్న అకృత్యాలకు, అమానుష, డొల్ల మావోయిస్టు సిద్ధాంతాల పట్ల విరక్తి చెంది తాము స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు నక్సల్స్ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు నిర్వహించే అమరవీరుల వారోత్సవాల వేళ ఐదుగురు నక్సలైట్లు లొంగిపోవడాన్ని గణనీయమైన పరిణామంగా పోలీసులు అభివర్ణించారు. లొంగిపోయిన నక్సలైట్లకు రూ. 25 వేల చొప్పున సహాయంతోపాటు ప్రభుత్వ విధానం ప్రకారం పునరావాసం కల్పించనున్నట్లు వారు చెప్పారు.
- Advertisement -