ఇద్దరు తెలంగాణ వారు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరో ఐదుగురు కొత్త ఐపిఎస్ అధికారులను కేంద్రం కేటాయిస్తూ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈక్రమంలో 2020 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన మొత్తం 200 మంది ఐపిఎస్ అధికారులలో తెలంగాణ రాష్ట్రానికి ఐదుగురు, ఎపికి నలుగురిని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2021 నవంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న ఖాళీల ఆధారంగా ఈ మేరకు కేటాయింపులు చేసినట్లు కేంద్ర వివరించింది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన ఐదుగురు ఐపిఎస్ అధికారులలో అవినాశ్‌కుమార్(బీహార్), కాజల్(ఉత్తరప్రదేశ్), కంకణాల రాహూల్‌రెడ్డి(తెలంగాణ), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి(తెలంగాణ) ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ఐఏఎస్, ఐపిఎస్‌లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖలు రాసింది. దీంతో తాజాగా ఐదుగురు ఐపిఎస్‌లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించిన వారిలో వర్షిత ఆడెపు(ఒడిశా), బి ఆదిత్య(రాజస్థాన్), అభిషేక్ అందాసు(రాజస్థాన్), కోటా కిరణ్‌కుమార్(బీహార్), చిలుముల రజనీకాంత్(మహారాష్ట్ర) ఉన్నారు.