Thursday, January 23, 2025

గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబంలోని ఐదుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ద్వారకా సౌత్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్ పేలి మంటలు పైకెగయడంతో కుటుంబం లోని ఐదుగురు గాయపడ్డారు. పాలం విహార్ ప్రాంతంలోఒక కుటుంబం తమ నాలుగు అంతస్తుల భవనంలోని కింది అంతస్తులో మంగళవారం రాత్రి అతిధులకు విందు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నాలుగు పైరింజన్లు వచ్చి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు. గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీకవడమే ఈ ప్రమాదానికి దారి తీసినట్టు పోలీస్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News