Friday, December 20, 2024

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరాన్‌గఢ్ బిలాయ్‌గఢ్ జిల్లా లోని సలీహా పోలీస్ స్టేషన్ పరిధి లోని తార్గావ్ గ్రామంలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి వేట్లు ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన ఓ వ్యకి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే తార్గావ్ గ్రామం లోని ఓ ఇంట్లో హేమ్‌లాల్ సాహు (55) అనే వ్యక్తి , తన భార్య జగ్మోతి సాహు (50) , వారి కుమార్తెలు మమతా సాహు (35), మీరా సాహు (30), వారి మనుమడు ఆయుష్ (5) , మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలో శనివారం వీరంతా విగతజీవులుగా పడి ఉండడం మిస్టరీగా మారింది. వారింటికి సమీపాన మనోజ్‌సాహు అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని ఐదుగురిది అనుమానాస్పద మృతిగా, మనోజ్ సాహుది ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన మనోజ్ సాహునే అయిదుగురిని గొడ్డలితో హత్య చేసి తరువాత తాను చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీస్‌లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News