Monday, December 23, 2024

యుపిలో ఐదుగురి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Five of Family Killed in Uttar Pradesh

రెండేళ్ల బాలుడూ బలి, చంపి ఇంటికి మంటలు

ప్రయాగ్‌రాజ్ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రెండేళ్ల బాలుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఎవరో దారుణంగా హతమార్చారు. ఈ భయానక ఘటన శనిఆరం తెల్లవారుజామున జరిగింది. జిల్లాలోని ఖావాజ్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా కుటుంబం అంతా ఈ హత్యాకాండలో తుడిచిపెట్టుకుపోయింది. మృతులలో రామ్‌కుమార్ యాదవ్ (55) , ఆయన భార్య 52 ఏండ్ల కుసుం దేవి , కూతురు పాతికేళ్ల మనీషా, కోడలు సవిత (27), మనవరాలు రెండేళ్ల మీనాక్షి ఉన్నారు. హంతకులు చివరికి రెండేళ్ల పాపను కూడా వదిలిపెట్టకుండా చంపిపారేయడం కలవరానికి దారితీసింది. ఘటన సమయంలో యాదవ్ కుమారుడు 30 ఏండ్ల సునీల్ యాదవ్ ఇంట్లో లేడు. మరో మనువరాలు సాక్షి (5 ఏండ్లు) వేరేగదిలో నిద్రిస్తూ ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. ఘటనాస్థలాన్ని సీనియర్ పోలీసు అధికారి అజయ్ కుమార్ తమ బృందంతో కలిసి పరిశీలించారు. మృతుల దేహాలను గమనిస్తే దుండగులు లేదా హంతకుడు ఎవరో వారిని నిద్రలోనే తలపై కొట్టి చంపివేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టంకు పంపిస్తున్నామని , దారుణకాండకు పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు , గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు వివరించారు. దుండగులు ఘాతకానికి పాల్పడి బయటకు వెళ్లుతూ ఇంటిని తగులబెట్టారని ఆ దశలో ఓ గదిలో ఐదేళ్ల అమ్మాయి ఉన్నట్లు ఆమె కేకలు ఇంటి నుంచి పొగలు మంటలు రావడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. లోపల గాయాలతో పడి ఉన్న భౌతికకాయాలు కన్పించాయని వెల్లడైంది. ఘటన జరిగిన ఇంటికి జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఖత్రీ ఇతర అధికారులు హుటాహుటిన వెళ్లారు. ఇంటికి మంటలు అంటుకున్నాయని హుటాహుటిన అక్కడికి అగ్నిమాపక శకటాలు కూడా చేరుకున్నాయి. ఇంటిలోపల దారుణ కాండ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు కారణాలను ఆరాతీస్తున్నామని కుటుంబంతో ఎవరికి ఎటువంటి వైరం లేదని ఇప్పటికైతేతెలిసిందని జిల్లా కలెక్టరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News