చండీగఢ్: పుట్టింటి నుంచి తన ఇంటికి తిరిగి రావడానికి నిరాకరించిందన్న కోపంతో ఒక 30 ఏళ్ల వ్యక్తి తన భార్యతోపాటు ఇద్దరు మైనర్ పిల్లలను, అత్తమామలను వారు నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..పరంజిత్ కౌర్ తన ఇద్దరు మైనర్ పిల్లలను తీసుకుని ఐదారు నెలల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తనను, తన పిల్లలను తన భర్త కుల్దీప్ సింగ్ కొట్టేవాడన్న కారణంతో లూధియానాలోని ఖుర్షేద్‌పూర్ గ్రామంలోని తన భర్త ఇంటికి వెళ్లడానికి ఆమె నిరాకరించింది. సోమవారం రాత్రి కుల్దీప్, మరో ఇద్దరు వ్యక్తులతో కలసి పరంజిల్ కౌర్ ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మృతులను పరంజిత్ కౌర్, ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగీందరో, పిల్లలు అర్షదీప్(8), అన్మోల్(5)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్య మీద కోపంతో ఐదుగురి సజీవ దహనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -