Monday, January 20, 2025

ఇంగీష్ ఛానల్ దాటుతూ ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు వెళ్లడానికి అక్రమంగా ఇంగ్లీష్ ఛానల్ దాటుతుండగా ఐదుగురు మృతిచెందారని ఫెంచి మీడియా వెల్లడించింది. ఉత్తర ఫ్రాన్ లోని విమిరియాక్స్ బీచ్ వద్ద మంగళవారం ఈ మృతదేహాలను కనుగొన్నట్టు వాయిక్స్ డు నార్డ్ అనే వార్తా పత్రిక వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి ఎంతమంది వలసదారుల పడవలు బయలుదేరాయో ఆ వివరాలు ఏవీ తెలియరాలేదు. ఆ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు మాత్రం భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఉత్తర ఫ్రాన్స్ లోని కొలాయిస్ రీజియన్ బ్రిటన్‌కు వెళ్లడానికి చాలా దగ్గరి దారి.

2023లో ఈ సముద్ర మార్గ ద్వారా బ్రిటన్‌కు 36 వేల మంది సాహసోపేత ప్రయాణం చేశారని ఫ్రాన్స్ అధికార వర్గాల సమాచారం వెల్లడించింది. ఈ విధంగా బ్రిటన్‌కు సాగుతున్న అక్రమ వలసలను నిరోధించడానికి బ్రిటన్ ప్రవేశ పెట్టిన వివాదాస్పద భద్రతా రువాండా బిల్లుకు ఆమోదం తెలిపిన కొన్ని గంటల లోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం అక్రమంగా వలస వచ్చేవారిని 6400 కిమీ దూరంలో ఉన్న రువాండాకు తరలించి అక్కడి శరణార్ధ శిబిరాల్లో ఉంచుతారు. ఈ బిల్లును ఆమోదించడంపై బ్రిటన్ విపక్షాల తోపాటు ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మానవ హక్కుల సంఘాలు ఇది అమానవీయమని విమర్శించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News