భోపాల్ : మధ్యప్రదేశ్ లోని మొరేనా జిల్లా జరేరువా ప్రాంతంలో సాక్షి ఫుడ్ ప్రోడక్ట్‌కు చెందిన ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున కూలీలు పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీని ఖాళీ చేయించారు. ఫ్యాక్టరీ లోని ట్యాంకులను శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు మొదట అందులోకి దిగారని తోటి కార్మికులు తెలిపారు.
శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువు లీకై ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ఉన్న మరో ఇద్దరు వారిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగారు. వారు కూడా విషవాయువు పీల్చడంతో మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సోదరులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలో చెర్రీలను చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.