Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై : పశ్చిమ మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. సుమోటో వాహనంలో ఐదుగురు ప్రయాణిస్తుండగా , ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలతో మరో ముగ్గురు మిరాజ్ సివిల్ ఆస్పత్రిలో మృతి చెందారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రత్నగిరిపంథర్‌పూర్ రోడ్డుపై మిరాజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, ఒక మహిళ ఉన్నారు. కొల్హాపూర్ నుంచి రత్నగిరి వైపు చాలా వేగంగా సుమోటో వెళ్తుండగా, వ్యతిరేక దిశలో ఇటుకలతో ట్రాక్టర్ రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీస్‌లు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News