Wednesday, January 22, 2025

మక్తల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నారాయణపేట  : నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం, జక్లేరు బొందలకుంట అంతర్ రాష్ట్ర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్న పాప ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బొందలకుంట గ్రామ స్టేజి మలుపు దగ్గర వేగంగా ఢీకొన్నాయి. ఆ సయమంలో రెండు కార్లలో ఏడుగురు ఉండగా, అందులో ఐదుగురు కార్లలోనే ఇరుక్కొని మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన కారు, కర్ణాటకకు చెందిన కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్, ఫోన్ నెంబర్ల ఆధారంగా వీరంతా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.

తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నేవీలో పనిచేస్తున్న దీపక్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక కార్వార్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా జక్లేర్ స్టేజి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దీపక్ భార్య ప్రభిత (32) కుమార్తె అస్మిత (7) అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో కారులో వెళ్తున్న ఉన్న కర్ణాటకలోని సైదాపూర్ గ్రామానికి చెందిన మౌలాలి, ఖలీల్, బసమ్మ మృతి చెందారు. మణివారప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై మక్తల్ సిఐ రంలాల్, ఎస్‌ఐ పర్వతాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News