Monday, January 13, 2025

ఆటోను బొగ్గులారీ ఢీకొని ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Five people died in road accident at odisha

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారి (53)పై ఓ ఆటోను బొగ్గులారీ ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక బాలిక, ఆటోడ్రైవర్ కూడా ఉన్నారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బంగూర గ్రామానికి చెందిన కుటుంబం ఆటోలో ముక్తపాసి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తరువాత మృతుల బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి బైఠాయింపు విరమింప చేశారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News