Monday, January 20, 2025

పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఓ పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అర్థరాత్రి పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించి మొదట ఒకరు బావిలోకి దూకారు. అతని కోసం మరోకరు.. అలా ఒకరు తర్వాత మరొకరు.. మొత్తం ఐదుగురు బావిలోకి దూకి చనిపోయారు. చివర్లో తాడు సాయంతో బావిలోకి దిగిన ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఘటనాస్థలంలో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావిని బయోగ్యాస్ కోసం వినియోగిస్తున్నారని.. ఈ క్రమంలో అందులో పడిన వారు ఊరిపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని మాణిక్ కాలే(65), మాణిక్ కుమారుడు సందీప్(36), అనిల్ కాలే(53), అనిల్ కుమారుడు బబ్లూ(28), బాబాసాహెబ్ గైక్వాడ్(36)లుగా గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News