Monday, December 23, 2024

ఒకే ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు హత్య.. చంపింది అతనే..

- Advertisement -
- Advertisement -

మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లో నిద్రిస్తున్న ఐదుగురిని ఓ యువకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురిని హత్య చేసిన అనంతరం నిందితుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం ఉదయం మెయిన్‌పురి జిల్లాలోని గోకుల్‌పూర్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అసలు ఏం జరిగింది..
గోకుల్‌పూర్‌కు చెందిన శివవీర్ యాదవ్ (30).. అతని సోదరులు భుల్లన్ యాదవ్ (25), సోనూ యాదవ్ (21), సోను భార్య సోని (20), బావ సౌరభ్ (23), స్నేహితుడు దీపక్ పాయ్ (20)లను గొడ్డలితో చంపాడు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం భార్య డాలీ, అత్తపై దాడి చేశాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన నిందితుడు శివవీర్ యాదవ్ అత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు శివవీర్ ఈ హత్యలు ఎందుకు చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, నిఘా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శివవీర్ శుక్రవారం ఇటావా నుంచి గోకుల్‌పూర్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడు ఈ నేరానికి పాల్పడ్డాడని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News