Monday, December 23, 2024

గెలాక్సీఎ సిరీస్‌లో ఐదు కొత్త ఫోన్లు

- Advertisement -
- Advertisement -

గెలాక్సీఎ సిరీస్‌లో ఐదు కొత్త ఫోన్లు
ఆవిష్కరించిన సామ్‌సంగ్

మన తెలంగాణ/ హైదరాబాద్ : స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ సామ్‌సంగ్ తన గెలాక్సీఎ సిరీస్‌లో ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధర శ్రేణి రూ.15 వేల నుంచి రూ.45 వేల మధ్య ఉంది. ఈ సందర్భంగా సామ్‌సంగ్ కేటగిరీ హెడ్ (మిడ్, హై స్మార్ట్‌ఫోన్స్) అక్షయ్ ఎస్.రావ్ మాట్లాడుతూ, 25 శాతం నుంచి 40 శాతానికి మార్కెట్ వాటాను పెంచే లక్షంలో కొత్త ఫోన్ల శ్రేణి దోహదం చేస్తుందని అన్నారు.

ఐదు నూతన మోడల్స్ గెలాక్సీ ఎ13, ఎ23, ఎ335జి, ఎ535జి, ఎ735జిను సంస్థ విడుదల చేసింది. ఐదింటిలో మూడు ఫోన్లు 5జితో ఆవిష్కరించారు. సరసమైన ధరకే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఫోన్లు అందించాలని కంపెనీ ప్రయత్నిస్తోందని ఆయన వివరించారు. ఆప్టికల్ లెవల్ స్టెబిలైజేషన్(ఒఐఎస్)తో ఫ్లాగ్ షిప్ లెవల్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో గెలాక్సీ ఎ73 5జి వస్త్తోంది. దీనిలో ఐపి67 రేటింగ్ ఉండటం వల్ల నీరు, మురికిని నిరోధించే సామర్థం ఉంటుంది. దీనిలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 778జి 5జి ప్రాసెసర్, సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను 120 హెట్జ్జ్ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ధర విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాతో పోటీలో ముందున్నామని, తాము 40 శాతం వాటాను పెంచుకోవాలని లక్షంగా చేసుకున్నామని రావ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News