Monday, December 23, 2024

ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

five poker players arrested in mancherial

కాసిపేటః అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నట్లు మందమర్రి ఎస్‌ఐ చంద్రకుమార్ తెలిపారు. సింగరేణి సబ్‌స్టేషన్ వెనక ప్రాంతంలోని అడవి ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందిని ఆయన తెలిపారు. దాడిలో మందమర్రి పట్టణానికి చెందిన మిట్టపల్లి బాబు, గుడికందుల ఓదేలు, దుర్గం రవి, మొయ్య రాంబాబు, సిద్దినాథ్ కిరణ్‌లు ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు. పేకాట ఆడుతున్న వారినుండి 8860 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రకుమార్ తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా అసాంఘీక కార్యాక్రమాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News