Wednesday, January 22, 2025

తెలంగాణలో ఐదు విప్లవాలు చూడబోతున్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరు ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా కూడా స్పందన లేదని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఇండస్ట్రియల్ డిపార్ట్ మెంట్ ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇవ్వాలని విభజనం చట్టంలో ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్క రూపాయి ఇండస్ట్రియల్ ఇన్సింటివ్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు తెలంగాణ ముందుకొచ్చిందని, పోటీగా గుజరాత్ ఆర్బిట్రేషన్ పెట్టి బడ్జెట్ ఇచ్చారని కెటిఆర్ గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, 1987లో ఇండియా, చైనా ఎకానమి 470 బిలియన్ డాలర్లు ఉందని, ఇప్పుడు చైనా ఎకానమి 16 ట్రిలియన్ డాలర్లు చేరుకుందన్నారు. ఇండియా ఎకనామి 3 ట్రిలియన్ల వద్దే ఉందని ఎద్దేవా చేశారు.

చైనా పర్ క్యాపిటా ఇన్‌కమ్ తొమ్మిది వేల డాలర్లు ఉండగా ఇండియా పర్ క్యాపిటా 1800 డాలర్లుగా ఉందన్నారు. పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లతో మనం పోటీ పడ్డామన్నారు. తెలంగాణలో ఐదు విప్లవాలు చూడబోతున్నామని, ఆగ్రికల్చర్, ఫిషరీస్, డెయిరీ, మాసం, పామాయిల్ విప్లవాలు రాబోతున్నాయన్నారు. 2014లో తెలంగాణ పర్ క్యాపిటా 1.24 లక్షలుండగా ఇప్పుడు 2.78 లక్షలకు చేరుకుందని, 2014లో జిఎస్‌డిపి రూ.5 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం రూ11.5 లక్షల కోట్లు ఉందని ప్రశంసించారు. కరోనా సమయంలో కేంద్రం నుంచి జీరో సపోర్ట్ ఉన్నా అన్ని రంగా ముందుకెళ్తున్నామన్నారు. దేశ ఎకానమిలో తెలంగాణ నాల్గొ స్థానంలో ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News