Monday, December 23, 2024

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఐదుగురు పారిశుధ్య కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విష వాయువు పీల్చి ఐదుగురు పారిశుధ్య కార్మికులు మరణించారు. మరోకార్మికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. పర్భనిలోని బరూచా తండాలో గురువారం సాయంత్రం ఒక వ్యవసాయ క్షేత్రంలోని సెప్టిక్ ట్యాంకును ఆరుగురు పారిశుధ్య కార్మికులు శుభ్రం చేస్తుండగా విష వాయువు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా ఐదుగురు అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియురాలిని చంపి… కూతురుకు ఫోన్ చేశాడు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News