Monday, March 17, 2025

బలూచిస్తాన్‌లో ఉగ్ర దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బంది బలి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లోని కల్లోలిత బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ తీవ్రవాదులు ఆదివారం సాగించిన ఉగ్ర దాడిలో కనీసం ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించగా, డజను మందికి పైగా గాయపడ్డారు. ఆ ప్రావిన్స్‌లోని నోష్కి జిల్లాలో ఎదురుకాల్పుల సంఘటనలో ఆత్మాహుతి బాంబర్ సహా నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడుపదార్థాలతో నిండిన వాహనంతో నుష్కి దల్బందిన్ జాతీయ రహదారిపై పారామిలిటరీ ఫ్రాంటియర్ కోర్ (ఎఫ్‌సి) వాహనశ్రేణిలోకి దూసుకుపోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ చీఫ్ జాఫరుల్లా సుమలాని తెలిపారు.

దాడి స్థలంలో సేకరించిన ఆధారాలను బట్టి ఆత్మాహుతి బాంబర్ పేలుడువస్తువులతో నిండిన వాహనంతో ఎఫ్‌సి కాన్వాయ్‌లోకి దూసుకుపోయినట్లు తేలిందని సుమలాని చెప్పారు. ఆ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగి ఆత్మాహుతి బాంబర్ సహా నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్’ దినపత్రిక తెలియజేసింది. నిషిద్ధ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) తీవ్రవాదులు ఆ దాడికి పాల్పడినట్లు కూడా భద్రత దళ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక తెలియజేసింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, దేశీయాంగ శాఖ మంత్రి మోహ్సిన్ నఖ్వి, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఆ దాడిని ఖండించారు. ఆ ఘటనలో ప్రాణ నష్టం పట్ల వారు విచారం వెలిబుచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News