Friday, December 20, 2024

ఐదుగురు ఎస్‌ఐలకు సిఐలుగా పదోన్నతులు

- Advertisement -
- Advertisement -
  • అభినందించిన సిపి శ్వేత

సిద్దిపేట: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్‌ఐలు, సిఐలుగా పదోన్నతి పొందారు. సోమవారం సిఐలుగా పదోన్నతి పొందిన రంగకృష్ణ, సంపత్‌కుమార్, శ్రీధర్‌గౌడ్, మహేందర్, ప్రవీణ్‌రాజ్‌లు సిపి శ్వేతను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు. అనంతరం సిపి శ్వేత చేతుల మీదుగా అధికారుల భుజాలపై ఇన్‌స్పెక్టర్ చిహ్నం అయిన మూడవ నక్షత్రాలను ఆలంకరించడంతో పాటు పదోన్నతి పొందిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహన్ని కలిగిస్తాయన్నారు. నూతన బాధ్యతలు పెంచుతాయని తెలిపారు. పదోన్నతి వల్ల వచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News