హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగంపై యూత్ పర్ యాంటీ కరప్షన్ సంస్థ పలు ప్రాంతాల్లో అవగాహనతో పాటు పలు అంశాలపై ఓటర్లతో చర్చించారు. ఈసంస్థ రాజేంద్ర మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఓటు మన అభివృద్ధిని, మన పిల్లల భవిష్యత్తును మార్చే ప్రధాన ఆయుధమని, ప్రజల కోసం పనిచేసే మంచివారికి పట్టం కట్టాలని చెపుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలపై చర్చినట్లు తెలిపారు. స్థానికంగా అవినీతి ఏలా ఉంది, అధికారుల పనితీరుపై ప్రజలతో ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు. అవినీతి రహిత సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న యూత్ పర్ యాంటీ కరప్షన్ సంస్థలో ముందుకు నడవాలని, ఆసక్తి న్న వారు తమ సంస్దతో కలిసి నడవాలని సంస్థ ఫౌండర్ రాజేంద్ర పలువురికి సూచించారు. ఈకార్యక్రమంలో కొమటి రమేష్‌బాబు, మారియా అంతోని, వరికుప్పల గంగాధర్, హరిప్రకాష్, బిల్లా ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లను చైతన్య పరిచాలి: యాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -