Wednesday, January 22, 2025

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగనుంది. ఇవాళ మధ్యాహ్నం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఇసి విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది. సిఇసి రాజీవ్‌కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మధ్యప్రదేశ్ (230), రాజస్థాన్(200), ఛత్తీస్‌గఢ్(90), మిజోరాం(40) స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2024 జనవరిలో తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ గడువు ముగియనుంది. 2024 జనవరిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీల గడువు ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్ 17న మిజోరాం అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇప్పటికే తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News