Tuesday, January 21, 2025

కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడినట్టు సమాచారం. ఆదివారం అర్థరాత్రి గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కన ఉన్న గుడిసెలపై పడింది. భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. గుడిసెలలో ఎవరు ఉన్న విషయం తెలియలేదు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నామని, అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా ఉంచామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బిజెపి నేత సువేందు అధికారు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News