Monday, December 23, 2024

తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్ధుల ఆచూకీ లభ్యం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్ : తిరుపతిలో స్టడీ అవర్స్‌కు వెళ్ళి ఇంటికి తిరిగిరాని ఐదుగురు పదవ తరగతి విద్యార్థుల ఆచూకీ ఆగ్రాలో లభ్యమైంది. ఈనెల 9న విద్యార్థులు స్టడీ అవర్స్‌కు వెళ్ళి, ఇంటికి వస్తున్నట్లుగా సీసీటీవీలలో రికార్డు అయ్యింది. అయితే వారు ఇంటికి చేరలేదు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల స్నేహితులను ప్రశ్నించిన పోలీసులు తిరుపతి నగంలోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. అలాగే తమిళనాడు, బెంగుళూరు నగరాలకు ప్రత్యేక బృందాలను పంపించారు.

అయినా ఆచూకీ దక్కలేదు. ఆదివారం నాడు అదృశ్యమైన విద్యార్థుల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విద్యార్థులు ఆగ్రాలో ఉన్నట్లు పోలీసు గుర్తించారు. వారిని సోమవారం సాయింత్రానికి తిరుపతి నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అదృశ్యమైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు పదో తరగతి విద్యార్థు కాగా, మరొకరు తొమ్మిదో తరగతి విద్యార్థి ఉన్నారు. తాజ్ మహాల్‌ను చూసేందుకు వెళ్ళారా? లేక విద్యార్థులను ఎవరైనా తీసుకెళ్ళారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News