- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో ఆదివారం ఉదయం రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఐదుగురు త్రీవవాదులతో సహా జెఇఎం కమాండర్ జాహిద్ వాని హతమయ్యాడు. తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాల రాకను పసిగట్టిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకే 47 తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ జిల్లాలోని శింద్రా ప్రాంతంలో 200 పైగా డిటోనేటర్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -