- Advertisement -
జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో గురువారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కుల్గాం ప్రాంతంలో ఉగ్రవాద ఉనికికి సంబంధించి సమాచారం అందడంతో భద్రతా బలగాలు, పోలీస్‌లు కలిసి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. బెహిబాగ్ ప్రాంతం లోని కడ్డర్‌లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది.
- Advertisement -