న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్త చేస్తోంది. భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్ బిఐలో క్లర్క్ పోస్టులతో క్లరికల్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు మే 17 నుంచి అందుబాటులో ఉంటాయి. ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండడంతో పాటు అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్ 2 నుంచి 2021, ఏప్రిల్ 1 మధ్య జన్మించాలి. ఆన్ లైన్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్త 100 మార్కుల పేపర్ ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జిక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు… న్యూమరికల్ ఎబిలిటీ 70 ప్రశ్నలకు 70 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారు మెయిన్స్ లో ఎగ్జామ్స్ రాయోచ్చు. మెయిన్స్ 190 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 60 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్ నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.