Monday, November 18, 2024

సైన్యంలో నారీ శక్తికి వందనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశ సైన్యంలో వీరనారీల శకానికి అంకురార్పణ జరిగింది. మహిళలు దేశ సరిహద్దుల రక్షణలో ఎవరికి తీసిపోరు అనే సత్యాన్ని చాటేందుకు ఇదో అధ్యాయం అయింది. భారతీయ సైన్యంలో చారిత్రక తొలి ఘట్టంగా సైన్యంలోకి ఐదుగురు మహిళలను పదాతిదళంలోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురరిని చైనా సరిహద్దుల వెంబడి ఉండే వాస్తవాధీన రేఖ వెంబడి సైనికాధికారిణులుగా నియమించారు. ఈ విధంగా సైన్యంలో మహిళా శక్తికి తొలిసారిగా పట్టం కట్టినట్లు అయింది. ఇంతకాలం మహిళలు సుకుమారం అని , వారు కొండలు గుట్టలు, ఎండలు వానలు మధ్య ముందుకు కదలలేరని సరిహద్దుల యుద్ధ క్షేత్రాలకు వీరిని దూరంగా ఉంచుతూ వచ్చారు. అయితే మహిళలు మగవారితో సమానంగా పోరాట పటిమను చాటుకోగలరనే విషయాన్ని చాటేందుకు ఇప్పుడు ఐదుగురు మహిళా అధికారుల బృందాన్ని సైన్యంలో విధులలోకి పంపించారు.

లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెప్టినెంట్ పియోస్ ముద్గిల్, లెప్టినెంట్ ఆకాంక్ష, లెఫ్టినెంట్ రేఖాసింగ్‌లను పదాతిదళంలోకి తీసుకున్నట్లు సైనిక వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. వీరిలో ముగ్గురు పలు సవాళ్లతో కూడిన చైనా సరిహద్దు ప్రాంతాలలో విధుల్లోకి వెళ్లుతుండగా, మరో ఇద్దరు పాకిస్థాన్ సరిహద్దుల్లోని సంక్లిష్టాత్మక ప్రాంతాలలో తాము సైతం రీతిలో విధులకు సిద్ధం అయ్యారు. పదాతిదళం భారతీయ సైన్యానికి అత్యంత కీలకమైన విభాగంగా ఉంది. 280 సంప్రదాయక పోరాట పటిమల యూనిట్లతో కూడిన ఈ రెజిమెంట్ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను శత్రువుపై అవసరం అయినప్పుడు ప్రయోగించాల్సి ఉంటుంది. సంబంధిత శిక్షణ యావత్తూను చెన్నైలోని శిక్షణా సంస్థలో పొంది ఈ మహిళలు తమ తదుపరి విద్యుక్త ధర్మానికి సిద్ధం అయ్యారు.

వీరు బోఫోర్స్ హోవిట్జర్స్, ధనుష్, ఎం 777 హోవిట్జర్స్, కె 9 వజ్ర స్వయంఛోదక గన్స్ వాడాల్సి ఉంటుంది. సైనిక విభాగంలోకి మహిళలను అంతర్గత విధుల్లోకి తీసుకోవడం భారతీయ సైన్యంలో 2019 నుంచి ఆరంభం అయింది. అయితే సరిహద్దులలో క్షేత్ర పోరాట స్థాయిలో వీరిని రంగంలోకి దింపడం ఇదే తొలిసారి అయింది. ఇంతవరకూ మహిళలు మిలిటరీ పోలీసు విధులలో కేవలం కంటోన్మెంట్లలో, సైనిక స్థావరాలలో ఉంటూ విధులు నిర్వర్తించే వారు. అయితే ఈ ఏడాది జనవరిలోనే తొలిసారిగా ఆర్మీ ఇంజనీర్స్ విభాగానికి చెందిన మహిళా అధికారి క్యాప్టెన్ శివ చౌహాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎతైన యుద్ధ క్షేత్రం సరిహద్దుల సంక్లిష్ట ప్రాంతం అయిన సియాచిన్ గ్లేసియర్స్ వద్ద ఆఫీసరుగా నియమించారు. ఇప్పుడు ఇదే కోవలో ఐదుగురు సైనికాధికారిణులకు ఈ సంక్లిష్ట గురుతర బాధ్యతల అప్పగింతలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News