Friday, December 20, 2024

వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

five-year-old boy killed in street dog attack in katol

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా కటోల్ పట్టణంలో శనివారం వీధి కుక్కల దాడిలో ఒక ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఇక్కడకు 60 కిలోమీటర్ల దూరంలోని కటోల్ పట్టణంలోని ధంతోలి ప్రాంతంలో ఉదయం ఈ దారుణ సంఘటన జరిగింది. తన సోదరితో కలసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఐదేళ్ల బాలుడు విరాజ్ రాజు జైవర్‌పై వీధి కుక్కలు దాడి చేశాయని పోలీసులు తెలిపారు. వాటిని తరిమివేయడానికి అతని సోదరి ప్రయత్నించినప్పటికీ బాలుడిని నిర్మాణంలో ఉన్న ఒక కట్టడం వద్దకు ఈడ్చుకు వెళ్లిన కుక్కలు అతడిని దారుణంగా కరిచాయి. విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్థానికులు కట్టడం వద్దకు వెళ్లి చూడగా రక్తపు మరకలతో గాయాలపాలైన బాలుడు కనిపించాడు. ఆ బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News