Sunday, December 22, 2024

బోరు బావిలో పడిన బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

రాయిగఢ్ ( ఎంపి ) : మధ్యప్రదేశ్ రాయిగఢ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం బోరు బావిలో పడిన నాలుగేళ్ల బాలిక కథ విషాదాంతం అయింది. పిప్లియా రసోడా గ్రామంలో 25 అడుగుల లోతైన బోరుబావిలో పడిన మహి అనే ఈ బాలికను అధికారులు బుధవారం తెల్లవారు జామున 2. 45 గంటల ప్రాంతంలో బయటకు తీసి పాచోరి లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి క్షీణించడంతో అక్కడ నుంచి 70 కిమీ దూరం లోగల భోపాల్ లోని ప్రభుత్వ హమీడియా ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చనిపోయిందని చీఫ్ మెడికల్ , హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ వాడియా చెప్పారు. మంగళవారం సాయంత్రం మహి ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయింది. దాదాపు 25 అడుగుల లోతున్న బావిలో 22 అడుగుల లోతున చిక్కుకు పోయింది. రాష్ట్ర ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం వచ్చి బావికి సమాంతరంగా మార్గాలు తవ్వి ఆక్సిజన్ పంపించారు. ఆమెను సజీవంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలు విషాదాంతమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News