Wednesday, January 22, 2025

హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఐసిస్ వైపు యువతను ఆకర్శితులను చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు శనివారం తీర్పు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ అబుదాబి మాడ్యుల్ ద్వారా పేలుళ్లకు కుట్రపన్నారు. ఇద్దరు నిందితులు ఐసిస్ అబుదాబి మాడ్యూల్ కోసం పనిచేశారు. అబ్దుల్ బాసిత్ ఐసిస్ వైపు యువతను ఆకర్షితులను చేసేందుకు యత్నించాడు.

మరో ఉగ్రవాది అధ్నాన్ హుస్సేన్ నుంచి బాసిత్‌కు నిధులు అందాయి. ఈ నిధుల ద్వారా యువకులకు వీసా, పాస్‌పోర్టులను బాసిత్ ఏర్పాటు చేశాడు. 2017లో అబ్దుల్ బాసిత్ ఇంటర్వూను చూసి అబ్దుల్ ఖదిర్ ఆకర్షితుడయ్యాడు. ఐసిస్ ఐడియాలజీని అబ్దుల్ ఖాదిర్ ప్రమోట్ చేశాడు. అబ్దుల్ బాసిత్ నిర్వహించి ఐసిస్ కార్యక్రమాలకు అబ్దుల్ ఖాదిర్ హాజరయ్యేవాడు. వీరి కుట్రను తెలుసుకున్న ఎన్‌ఐఏ 2018లో ఇద్దరిని అరెస్టు చేసింది. ఇద్దరిపై విచారణ చేసి 2019లో సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News