Friday, December 27, 2024

ఫిక్సింగ్ పదానికి మా జట్టులో తావులేదు: షాన్ మసూద్

- Advertisement -
- Advertisement -

కరాచీ : టి20 వరల్డ్ కప్‌లో చిత్తై లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టుపై ఇంటాబయ టా విమర్శలు వస్తూనే ఉన్నాయి. పాక్ ఘోర వైఫల్యానికి ఆ జట్టలో గ్రూపుల గొడవనే కారణమని మాజీలు సయితం దుమ్మెతిపోసిన సంగతి తెలిసిం దే. తాజాగా పాక్ జట్టు ఫిక్సర్లు పన్నారమే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ మొదలవుతుందనగా ఈ వార్తలు కలకలం రేపుతున్నాయి.

సోమవారం విలేకరులతో మాట్లాడిన టెస్టు సారథి షాన్ మసూద్‌ను జర్నలిస్ట్‌లు ఇదే విషయమై ప్రశ్నించారు. అతడు అదంతా అబద్దమంటూ కొట్టిపారేశాడు. ‘ప్రస్తుతం పాక్ క్రికెట్‌లో ఆ పదానికి చోటే లేదని ఖండించా డు. వరల్డ్ కప్ ముగిసిపోయింది. అది గతం. మే ము గతంలోకి వెళ్లకుండా ప్రస్తుతం జరగబోయే సిరీస్‌లపై దృష్టి పెట్టాం. ఆ ఓటమిని మరిచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నాం. ప్రతి టగాడు జట్టు విజయానికి కృషి చేస్తారని, ఆటలో గెలుపు ఓటములు సహజమే. కానీ, పరాజయం చెందినప్పుడు మేము ఎంతో బాధపడుతాం’ అని మసూద్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News