ఉండవల్లి: మండల పరిధిలోని తక్కశీల గ్రామంలో ఆదివారం జెండా పండుగ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఎస్పీ అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతి ఆదివారం మండల కేంద్రంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని చేయడం వలన అక్కడున్న బూత్ కమిటీ వారు గ్రామంలో ఉన్న బహుజనులు అంత కూడా ఒకసారి మరల పార్టీ గెలుపు ఆలోచన దిశగా ప్రతి గ్రామం కమిటీ ముందుంటుందని మండల అధ్యక్షులు సూచించారు.
అదే విధంగా బహుజన బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజ్ పార్టీ 1984 సంవత్సరంలో స్థాపించబడిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోడి కథ అన్నట్లు గత నాలుగు సంవత్సరాలు ప్రజల ఈకలంత తీసేసి మరల కోడికి గింజలు వేసినట్లుగా ఎలక్షన్లు వచ్చినావని ఈ పథకాలు వదిలారు. ఇది ఇంత వరకు కరెక్ట్ అని నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
అలంపూర్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ అడిషనల్ డిజిపి పదవిని త్రునపయంగా వదిలి వచ్చిన డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నాయకత్వాన్ని బలపర్చి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, శివశంకర్‌గౌడ్, నాగేంద్ర, రాజు, మహేష్ తదితరులు ఉన్నారు.