Sunday, December 22, 2024

తమిళనాడు కుట్రాలంలో దూసుకొచ్చిన జలపాతం

- Advertisement -
- Advertisement -

ఓ బాలుడు గల్లంతై మృతి

తెన్ కాశీ(తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని తెన్ కాశీలో కొన్ని రోజులుగా వానలు పడుతున్నాయి.  అక్కడ పశ్చిమ కనుమలలోని కుట్రాలంలో జలపాతం సందర్శకులకు ఆకర్షణీయ ప్రదేశం. అయితే  నేడు ఉన్నట్టుండి కొన్ని సెకండ్లలోనే జలపాతం దూసుకొచ్చింది. చాలా మంది భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. కానీ ఈ జలపాతం తాకిడికి 17 ఏళ్ల అశ్విన్ అనే కుర్రాడు గల్లంతయ్యాడు. ఆ బాలుడు 11 వ తరగతి చదువుతున్నాడు. అతడు  పాలయం కోటైలోని ఎన్జీవో కాలనీ వాసి.

రక్షణ చర్యలను వేగవంతం చేశారు. అశ్విన్ మృత దేహం అర కిలోమీటరు దూరంలో కొండరాళ్ల మధ్య చిక్కుకుని లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News