Saturday, November 2, 2024

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..128 రోడ్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం పలుప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈమేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆగస్టు 16 వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. నహాన్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి అత్యధికంగా 168.3 మిమీ వర్షపాతం నమోదైంది. సంధోల్‌లో 106.4 కిమీ, నగ్రోటా సూరియన్‌లో 93.2 మిమీ , ధౌలకువాన్‌లో 67 మిమీ, జుబ్బర్‌హట్టిలో 56.2 మిమీ , కందఘహట్టిలో 45.6 మిమీ వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమై, రోడ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగి పడుతుండడంతో ముందు జాగత్రతగా 128 రోడ్లను అధికారులు మూసివేశారు. మండి, సిర్మౌర్, సిమ్లా, కులు, జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు వరద ముప్పు పొంది ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరింది. జూన్ 27 నుండి ఆగస్టు 9 మధ్య కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 100 మందికి పైగా మృతి చెందారు. రూ.842 కోట్ల వరకు నష్టం వాటిల్లింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News