Thursday, January 23, 2025

పారదర్శకంగా ఈవీఎం యంత్రాల ఎఫ్‌ఎల్‌సీ నిర్వహణ

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పారదర్శకంగా ఈవీఎం ఎఫ్‌ఎల్‌సీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం మిషన్‌ల చెకింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫస్ట్ లెవల్ చెకింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

జిల్లాకు వచ్చిన ప్రతి ఈవీ ఎం యంత్రంలోని బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన చేస్తామన్నారు. వీటిపై గత మూడు రోజుల క్రితమే అన్ని రాజకీయ పక్షాలకు సమాచారం అందించామన్నారు. సీజ్ చేసిన ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల సమక్షంలో తెరిచామని, 1509 బ్యాలెట్ యూనిట్లను, 1179 కంట్రోల్ యూనిట్లు, 1270 వీవీప్యాట్‌లను చెక్ చేస్తామన్నారు.

వీటి పరిశీలనకు రాజకీయ పార్టీల అధ్యక్షుల లెటర్‌తో ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు చెకింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు క లెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ వెంకట మాధవరావు, ఈడీఎం కవిత, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News