Monday, February 3, 2025

జపాన్ లో ప్రబలిన రెండు రోజుల్లో చంపేసే అరుదైన వ్యాధి

- Advertisement -
- Advertisement -

టోక్యో: కోవిడ్ మహమ్మారి తర్వాత ఇప్పుడు శరీర మాంసాన్ని తినేసే బ్యాక్టీరియా (flesh-eating bacteria)కారణంగా కలిగే అరుదైన జబ్బు ఇప్పుడు జపాన్ లో ప్రబలింది. ఈ జబ్బు 48 గంటల్లో చంపేస్తుంది.

స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) కేసులు ఈ ఏడాది జూన్ 2 నాటికి 977కి చేరుకున్నాయి, గత ఏడాది మొత్తంగా నమోదైన 941 కేసుల కంటే ఎక్కువ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం, ఈ సంస్థ 1999 నుంచి ఇలాంటి సంఘటనలను ట్రాక్ చేస్తోంది.

గ్రూప్ ఏ  స్ట్రెప్టోకోకస్ (GAS) సాధారణంగా “స్ట్రెప్ థ్రోట్” అని పిలవబడే జబ్బు పిల్లలలో వాపు , గొంతు నొప్పికి కారణమవుతుంది.  అయితే కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల అవయవాల నొప్పి,వాపు,  జ్వరం, తక్కువ రక్తపోటుతో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న లక్షణాలకు దారితీస్తుంది.

“చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతాయి” అని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీలో అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి చెప్పారు. “ఒక రోగి ఉదయం పాదాల వాపును గమనించిన వెంటనే, అది మధ్యాహ్నం నాటికి మోకాలి వరకు విస్తరిస్తుంది ఆ తర్వాత వారు చనిపోవచ్చు’’ అని తెలిపారు.

ప్రస్తుత ఇన్ఫెక్షన్ల రేటు ప్రకారం, జపాన్‌లో ఈ సంవత్సరం కేసుల సంఖ్య 2,500 కి చేరుకోవచ్చని, “భయంకరమైన” మరణాల రేటు 30 శాతం ఉందని కికుచి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News